search
×

Stock Market News: టాప్‌ లేపిన సూచీలు! 547 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

Stock Market Closing Bell 27 July 2022: రెండు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 157 పాయింట్ల లాభంతో 16,641 వద్ద ముగిసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 27 July 2022: రెండు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. భారత స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 157 పాయింట్ల లాభంతో 16,641 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 547 పాయింట్ల లాభంతో 55,816 వద్ద ముగిశాయి. నిన్నటి ముగింపు 79.76తో పోలిస్తే డాలర్‌తో రూపాయి విలువ 14 పైసలు నష్టపోయి రూ.79.90 వద్ద ముగిసింది.

BSE Sensex

క్రితం సెషన్లో 55,266 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,258 వద్ద మొదలైంది. 55,157 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,853 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 547 పాయింట్ల లాభంతో 55,816 వద్ద ముగిసింది.

NSE Nifty

మంగళవారం 16,483 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,473 వద్ద ఓపెనైంది. 16,438 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,653 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 157 పాయింట్ల లాభంతో 16,641 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 36,370 వద్ద మొదలైంది. 36,248 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,808 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 372 పాయింట్ల లాభంతో 36,783 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 46 కంపెనీలు లాభాల్లో 4 నష్టాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, దివిస్‌ ల్యాబ్‌, ఎల్‌టీ, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, కొటక్‌ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఒకశాతం కన్నా ఎక్కువ పెరిగాయి. 

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 27 Jul 2022 03:47 PM (IST) Tags: Stock Market Update share market stock market today Stock Market Telugu Stock Market news

ఇవి కూడా చూడండి

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

టాప్ స్టోరీస్

Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 

Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 

Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్

Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్

Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్

Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్

Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం

Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం