search
×

Stock Market News: రూపాయి 80కి పడ్డా సెన్సెక్స్‌, నిఫ్టీ ఎగిశాయి! రియాల్టీ షేర్లకు గిరాకీ

Stock Market Closing Bell 19 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 80 మార్క్‌ను టచ్‌ చేసినా మదుపర్లు ఈక్విటీలను కొనుగోలు చేశారు.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 19 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 80 మార్క్‌ను టచ్‌ చేసినా మదుపర్లు ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 49 పాయింట్ల లాభంతో 16,328, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 246 పాయింట్ల లాభంతో 54,764 వద్ద ముగిశాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 54,521 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,251 వద్ద లాభాల్లో మొదలైంది. 54,232 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,817 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి  246 పాయింట్ల లాభంతో 54,767 వద్ద ముగిసింది.

NSE Nifty

సోమవారం 16,278 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,187 వద్ద ఓపెనైంది. 16,187 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,359 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 49 పాయింట్ల లాభంతో 16,328 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 35,113 వద్ద మొదలైంది. 35,110 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,761 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 361 పాయింట్ల లాభంతో  35,720 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, అపోలో హాస్పిటల్స్‌, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, టాటా కన్జూమర్‌ షేర్లు నష్టపోయాయి. మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, రియాల్టీ, మెటల్‌ సూచీలు ఎగిశాయి.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 19 Jul 2022 03:48 PM (IST) Tags: Stock Market Update share market stock market today Stock Market Telugu Stock Market news

ఇవి కూడా చూడండి

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

Market Holiday: స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

Market Holiday: స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

Bitcoin: బిట్‌కాయిన్‌కు బంపర్‌ ఆఫర్‌, క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన US

Bitcoin: బిట్‌కాయిన్‌కు బంపర్‌ ఆఫర్‌, క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన US

టాప్ స్టోరీస్

KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్

KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!

Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్

Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్

Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు

Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు