By: ABP Desam | Updated at : 26 May 2022 03:59 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing Bell on 26 May 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) గురువారం లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభపడ్డ సూచీలు తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక మదుపర్లు ఒక్కసారిగా కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,170 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 503 పాయింట్లు లాభపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 53,749 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,950 వద్ద లాభాల్లో మొదలైంది. ఆరంభంలో కొనుగోళ్ల ఊపు కనిపించినా వెంటనే పతనమవ్వడం మొదలైంది. 53,425 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక 54,346 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 503 పాయింట్ల నష్టంతో 54,252 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 16,025 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16105 వద్ద ఓపెనైంది. ఆరంభంలో లాభపడ్డా ఆ తర్వాత ఒడుదొడుకులకు లోనైంది. 15,903 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత 16,204 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 144 పాయింట్లు నష్టపోయి 16,170 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ మాత్రం భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 34,670 వద్ద మొదలైంది. 34,424 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,222 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 755 పాయింట్ల లాభంతో 35,094 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ 3 శాతం కన్నా ఎక్కువే లాభపడ్డాయి. యూపీఎల్, దివిస్ ల్యాబ్, సన్‌ఫార్మా, రిలయన్స్, ఓఎన్‌జీసీ నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఐటీ, పవర్, రియాల్టీ, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1-3 శాతం వరకు ఎగిశాయి.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?