Stock Market Closing Bell 15 July 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. నెగెటివ్ సెంటిమెంటతో సూచీలు ఒడుదొడుకులకు లోనైనా చివరికి లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 110 పాయింట్ల లాభంతో 16,049, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 344 పాయింట్ల లాభంతో 53,760 వద్ద ముగిశాయి. రూపాయిలో ఎలాంటి మార్పు లేదు. డాలర్‌తో పోలిస్తే 79.87 వద్ద ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 53,416 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,637 వద్ద లాభాల్లో మొదలైంది. 53,364 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,811 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 344 పాయింట్ల లాభంతో 53,760 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 15,938 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,010 వద్ద ఓపెనైంది. 15,927 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,066 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 110 పాయింట్ల లాభంతో 16,049 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 34,734 వద్ద మొదలైంది. 34,468 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,899 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 31 పాయింట్ల లాభంతో 34,682 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ఉన్నాయి. టాటా కన్జూమర్స్, టైటాన్, హిందుస్థాన్ యునీలివర్, టాటా మోటార్స్, ఎల్‌టీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, మెటల్ మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎగిశాయి. ఆటో సూచీ 2 శాతానికి పైగా పెరిగింది. ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డ్యురబుల్స్ 1 శాతానికి పైగా లాభపడ్డాయి.