Stock Market Opening Bell 15 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ఓపెనయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. నెగెటివ్‌ సెంటిమెంటతో మదుపర్లు అమ్మకాలు చేపట్టడంతో సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 25 పాయింట్ల లాభంతో 15,964, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 74 పాయింట్ల లాభంతో 53,487 వద్ద ట్రేడ్‌అవుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 53,416 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,637 వద్ద లాభాల్లో మొదలైంది. 53,475 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,755 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 74 పాయింట్ల లాభంతో 53,487 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


గురువారం 15,938 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,010 వద్ద ఓపెనైంది. 15,961 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,041 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 25 పాయింట్ల లాభంతో 15,964 వద్ద ట్రేడ్‌అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 34,734 వద్ద మొదలైంది. 34,528 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,734 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 111 పాయింట్ల నష్టంతో   34,539 వద్ద కదలాడుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. టాటా కన్జూమర్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌, ఎం అండ్‌ ఎం, ఎల్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోల్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ రంగాల సూచీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకు, ఐటీ, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు నష్టాల్లో ఉన్నాయి.