By: ABP Desam | Updated at : 20 May 2022 03:54 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీగా లాభపడ్డాయి. ఆరంభం నుంచే ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లకు ఎగబడ్డారు. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటం పాజిటివ్ సెంటిమెంటుకు దోహదం చేసింది. చైనాలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేయడం, కీలక వడ్డీరేట్లు సవరించడం మరో సానుకూల అంశం. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 9 శాతం వరకు ఉంటుదన్న అంచనాలతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,280 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1534 పాయింట్లు లాభపడింది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.7.5 లక్షల కోట్ల వరకు సంపద ఆర్జించారు.
BSE Sensex
క్రితం సెషన్లో 52,792 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,513 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 52,792 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఉదయం నుంచే కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీ గరిష్ఠాలకు చేరుకుంది. 54,396 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 1534 పాయింట్ల లాభంతో 54,326 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 15,809 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16043 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే లాభాల బాట పట్టింది. 16,003 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. మదుపర్లు ఎక్కువగా కొనుగోలు చేయడంతో 16,283 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 471 పాయింట్లు లాభపడి 16,280 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 33,765 వద్ద మొదలైంది. 33,658 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,358 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 960 పాయింట్ల లాభంతో 34,276 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 48 కంపెనీలు లాభాల్లో 2 నష్టాల్లో ముగిశాయి. డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. శ్రీసెమ్, యూపీఎల్ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు 3-4 శాతం వరకు మెరుగయ్యాయి.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Sabarimala Ayyappa 2024 : శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
Happy Birthday Naga Chaitanya: మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్