Stock Market Opening Bell on 3 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. అమెరికా, ఐరోపా మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు గ్యాప్‌ అప్‌తో మొదలవ్వడం మదుపర్లలో సానుకూల సెంటిమెంటు నింపింది. మైక్రో, మ్యాక్రో ఎకానమీ ఫ్యాక్టర్లూ ఇందుకు దోహదం చేశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,737, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 501 పాయింట్ల లాభంతో 56,319 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ షేర్లకు విపరీతంగా డిమాండ్‌ ఉంది.


BSE Sensex


క్రితం సెషన్లో 55,818 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 56245 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 56,241 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 56,432 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 501 పాయింట్ల లాభంతో 56,319 వద్ద కొనసాగుతోంది. ఆరంభం నుంచే మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు.


NSE Nifty


గురువారం 16,638 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం  16,761 వద్ద ఓపెనైంది. 16,742 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,793 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 111 పాయింట్ల లాభంతో 16,737 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 35,929 వద్ద మొదలైంది. 35,721 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,958 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 123 పాయింట్లు లాభపడి 35,736 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి. గ్రాసిమ్‌, శ్రీ సెమ్‌, అల్ట్రాటెక్‌ సెమ్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్‌ నష్టాట్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రియాల్టీ, మీడియా బ్యాంక్‌ సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఐటీ స్టాక్స్‌ను విపరీతంగా కొంటున్నారు. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మా సూచీలపై సెల్లింగ్‌ ప్రెజర్‌ ఉంది.