Stock Market Closing Bell on 2 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ఓపెనైన సూచీలు మధ్యాహ్నం వరకు రేంజ్‌బౌండ్‌లోనే కదలాడాయి. ఐరోపా మార్కెట్లు తెరవగానే మదుపర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. దాంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,638, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 436 పాయింట్ల లాభంతో 55,818 వద్ద ముగిశాయి. ఐటీ షేర్లకు విపరీతంగా డిమాండ్ కనిపించింది. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది.
BSE Sensex
క్రితం సెషన్లో 55,381 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,382 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. 55,135 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,891 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 436 పాయింట్ల లాభంతో 55,818 వద్ద ముగిసింది. ఫ్లాట్‌గా ఓపెనింగ్ సూచీ ఐరోపా మార్కెట్లు తెరిచాక రివ్వున ఎగిసింది. మదుపర్లు విపరీతంగా కొనుగోళ్లు చేపట్టారు.
NSE Nifty
బుధవారం 16,522 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,481 వద్ద ఓపెనైంది. 16,443 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,646 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 116 పాయింట్ల లాభంతో 16,638 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ విచిత్రంగా స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఉదయం 35,470 వద్ద మొదలైంది. 35,385 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,676 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 7 పాయింట్లు నష్టపోయి 35,613 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్‌ఫార్మా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు భారీగా లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, హీరో మోటోకార్ప్, ఐచర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్ గ్రిడ్ నష్టపోయాయి. బ్యాంక్, ఫైనాన్షియల్, ఆటో సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు భారీగా ఎగిశాయి.