Stock Market Opening Bell on 2 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. బెంచ్‌ మార్క్‌ సూచీలన్నీ రేంజ్‌బౌండ్లో కొనసాగుతున్నాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఆసియా మార్కెట్లు, మైక్రో ఎకానమీ ఫ్యాక్టర్స్‌ నుంచి సానుకూల సెంటిమెంటు కోసం మదుపర్లు ఎదురు చూస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,524 వద్ద ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 82 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.


BSE Sensex


క్రితం సెషన్లో 55,381 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,382 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. 55,135 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,451 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 82 పాయింట్ల లాభంతో 55,462 వద్ద కొనసాగుతోంది. ఓపెనింగ్‌ను చూస్తుంటే మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టేలా ఉన్నారు. సూచీ బహుశా రేంజ్‌ బౌండ్‌లో కదలాడొచ్చు.


NSE Nifty


బుధవారం 16,522 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,481 వద్ద ఓపెనైంది. 16,443 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,535 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 1.80 పాయింట్ల లాభంతో 16,524 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 35,470 వద్ద మొదలైంది. 35,385 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,655 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 3 పాయింట్ల లాభంతో 35,622 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ఉన్నాయి. రిలయన్స్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌, హీరోమోటో కార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, హిందుస్తాన్‌ యునీలివర్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలన్నీ రేంజ్‌బౌండ్‌లో స్వల్పంగా ఎగిశాయి. ఐటీ మీడియా, మెటల్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు స్వల్పంగా లాభాల్లో ఉన్నాయి. మిగతావన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.