By: ABP Desam | Updated at : 03 Jun 2022 10:30 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening Bell on 3 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. అమెరికా, ఐరోపా మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు గ్యాప్ అప్‌తో మొదలవ్వడం మదుపర్లలో సానుకూల సెంటిమెంటు నింపింది. మైక్రో, మ్యాక్రో ఎకానమీ ఫ్యాక్టర్లూ ఇందుకు దోహదం చేశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,737, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 501 పాయింట్ల లాభంతో 56,319 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ షేర్లకు విపరీతంగా డిమాండ్ ఉంది.
BSE Sensex
క్రితం సెషన్లో 55,818 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 56245 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 56,241 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 56,432 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 501 పాయింట్ల లాభంతో 56,319 వద్ద కొనసాగుతోంది. ఆరంభం నుంచే మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు.
NSE Nifty
గురువారం 16,638 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,761 వద్ద ఓపెనైంది. 16,742 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,793 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 111 పాయింట్ల లాభంతో 16,737 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 35,929 వద్ద మొదలైంది. 35,721 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,958 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 123 పాయింట్లు లాభపడి 35,736 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి. గ్రాసిమ్, శ్రీ సెమ్, అల్ట్రాటెక్ సెమ్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్ నష్టాట్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ, మీడియా బ్యాంక్ సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఐటీ స్టాక్స్‌ను విపరీతంగా కొంటున్నారు. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా సూచీలపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?