Stock Market @12 PM, 25 October 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందలేదు. బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 61 పాయింట్ల నష్టంతో 17,668 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 230 పాయింట్ల నష్టంతో 59,601 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 59,831 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,002 వద్ద లాభాల్లో మొదలైంది. 59,598 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,081 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 230 పాయింట్ల నష్టంతో 59,601 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


సోమవారం 17,730 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,808 వద్ద ఓపెనైంది. 17,668 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,811 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 61 పాయింట్ల నష్టంతో 17,668 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 41,513 వద్ద మొదలైంది. 41,107 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,530 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 146 పాయింట్ల నష్టంతో 41,158 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ, టాటా మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, హిందుస్థాన్‌ యునీలివర్‌, బ్రిటానియా, కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నష్టాల్లో ఉన్నాయి. ఆటో, ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు పతనమయ్యాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.