Samvat 2079: గత సంవత్సర కాలం (సంవత్ 2078) మొత్తం స్టాక్ మార్కెట్లకు ఓ పీడకల లాంటింది. కోలుకోనేందుకు చాలా సమయం పట్టేంతగా గ్లోబల్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దేశీయంగా & వివిధ దేశాల్లో వడ్డీ రేట్ల పెంపు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, మరీ ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణం వంటివి పిశాచాల్లా మార్కెట్లను తరిమాయి. మరికొన్ని నెలల పాటు ఇవే భయాలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
చాలా అభివృద్ధి చెందిన, చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే, ఇండియన్ భారతీయ మార్కెట్లు చాలా నయం అనిపించాయి. అధ్వాన్న పరిస్థితులను మన మార్కెట్లు చక్కగా ఎదుర్కొన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో పుంజుకోవడం, ద్రవ్యోల్బణం తగ్గుతుందనే అంచనాలతో చాలా బ్రోకరేజీలు ఇండియన్ ఈక్విటీస్ మీద సానుకూలంగా ఉన్నాయి. దేశీయ రికవరీ, పెరుగుతున్న వినియోగాన్ని ఆసరాగా చేసుకుని 10 పిక్స్‌ను సెలక్ట్ చేశాయి.
15కు పైగా బ్రోకరేజ్ ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన కీ పిక్స్‌ను సేకరించి, అన్నీ కామన్‌గా ఎంచుకున్న పేర్లతో ఓ లిస్ట్ తయారు చేసి ఇక్కడ ఇస్తున్నాం. వీటిలో ప్రతి స్టాక్‌ను కనీసం రెండు బ్రోకరేజ్‌లు సిఫార్సు చేశాయి. కొత్త సంవత్‌లో (Samvat 2079) ఇవి కనీసం 11 శాతం లాభాలను షేర్‌హోల్డర్లకు అందిస్తాయని బ్రోకరేజ్‌లు నమ్మకంగా ఉన్నాయి. గరిష్టంగా 26 శాతం రిటర్న్స్‌ను వీటి నుంచి ఆశిస్తున్నారు. బ్రోకరేజ్‌లు ఆశించిన వృద్ధి అవకాశం ఆధారంగా ఈ స్క్రిప్‌లకు 1 నుంచి 10 ర్యాంకులు కేటాయించాం. ఈ కౌంటర్ల కోసం ఇచ్చిన "మార్కెట్ ధర"ను గత మార్కెట్ సెషన్‌లో షేరు ముగింపు ధరగా రీడర్లు పరిగణించాలి.
ఇదిగో టాప్-10 లిస్ట్:
ర్యాంక్ నంబర్. 1
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
మార్కెట్ ధర: రూ.1438
టార్గెట్ ధర: రూ.1818
వృద్ధి అవకాశం: 26.4%
ర్యాంక్ నంబర్. 2
అశోక్ లేల్యాండ్
మార్కెట్ ధర: రూ.143
టార్గెట్ ధర: రూ.174
వృద్ధి అవకాశం: 21.7%
ర్యాంక్ నంబర్. 3
అల్ట్రాటెక్ సిమెంట్
మార్కెట్ ధర: రూ.6363
టార్గెట్ ధర: రూ.7520
వృద్ధి అవకాశం: 18.2%
ర్యాంక్ నంబర్. 4
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మార్కెట్ ధర: రూ.560
టార్గెట్ ధర: రూ.662
వృద్ధి అవకాశం: 18%
ర్యాంక్ నంబర్. 5
రిలయన్స్ ఇండస్ట్రీస్
మార్కెట్ ధర: రూ.2472
టార్గెట్ ధర: రూ.2881
వృద్ధి అవకాశం: 16.5%
ర్యాంక్ నంబర్. 6
ఐసీఐసీఐ బ్యాంక్
మార్కెట్ ధర: రూ.907
టార్గెట్ ధర: రూ.1030
వృద్ధి అవకాశం: 13.5%
ర్యాంక్ నంబర్. 7
ఎం&ఎం
మార్కెట్ ధర: రూ.1257
టార్గెట్ ధర: రూ.1423
వృద్ధి అవకాశం: 13.2%
ర్యాంక్ నంబర్. 8
ఇన్ఫోసిస్
మార్కెట్ ధర: రూ.1500
టార్గెట్ ధర: రూ.1697
వృద్ధి అవకాశం: 13.1%
ర్యాంక్ నంబర్. 9
హావెల్స్ ఇండియా
మార్కెట్ ధర: రూ.1167
టార్గెట్ ధర: రూ.1315
వృద్ధి అవకాశం: 12.7%
ర్యాంక్ నంబర్. 10
భారతి ఎయిర్‌టెల్
మార్కెట్ ధర: రూ.797
టార్గెట్ ధర: రూ.884
వృద్ధి అవకాశం: 10.9%
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.