Stock Market Opening Bell on 1 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం స్వల్ప లాభాల్లో ఓపెనయ్యాయి. సూచీలు రేంజ్‌బౌండ్‌లో కదలాడుతున్నాయి. ఒడుదొడుకుల మధ్య సాగుతున్నాయి. సానుకూల సెంటిమెంట్‌ ఉన్నప్పటికీ మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,612 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 121 పాయింట్ల లాభాల్లో ఉంది.


BSE Sensex


క్రితం సెషన్లో 55,566  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,588 వద్ద నష్టాల్లో మొదలైంది. ఆరంభం నుంచే కొనుగోళ్ల సందడి కనిపించింది. 55,407 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,791 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 121 పాయింట్ల లాభంతో 55,693 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


మంగళవారం 16,584 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,594 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే లాభాల్లో ఉంది. 16,694 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,649 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 28 పాయింట్ల లాభంతో 16,612 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 35,358 వద్ద మొదలైంది. 35,345 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,738 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 225 పాయింట్ల లాభంతో 35,713 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, టాటా కన్జూమర్‌, ఏసియన్‌ పెయింట్స్‌ లాభాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఆటో, అపోలో హాస్పిటల్స్‌, హిందాల్కో, సన్‌ఫార్మా, బ్రిటానియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్స్‌ రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. పవర్‌, ఆటో స్టాక్స్‌లో సెల్లింగ్‌ ప్రెజర్‌ ఉంది.