By: ABP Desam | Updated at : 01 Jun 2022 11:13 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening Bell on 1 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) బుధవారం స్వల్ప లాభాల్లో ఓపెనయ్యాయి. సూచీలు రేంజ్‌బౌండ్‌లో కదలాడుతున్నాయి. ఒడుదొడుకుల మధ్య సాగుతున్నాయి. సానుకూల సెంటిమెంట్ ఉన్నప్పటికీ మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,612 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 121 పాయింట్ల లాభాల్లో ఉంది.
BSE Sensex
క్రితం సెషన్లో 55,566 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,588 వద్ద నష్టాల్లో మొదలైంది. ఆరంభం నుంచే కొనుగోళ్ల సందడి కనిపించింది. 55,407 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,791 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 121 పాయింట్ల లాభంతో 55,693 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 16,584 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,594 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే లాభాల్లో ఉంది. 16,694 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,649 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 28 పాయింట్ల లాభంతో 16,612 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 35,358 వద్ద మొదలైంది. 35,345 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,738 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 225 పాయింట్ల లాభంతో 35,713 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, టాటా కన్జూమర్, ఏసియన్ పెయింట్స్ లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, సన్‌ఫార్మా, బ్రిటానియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. పవర్, ఆటో స్టాక్స్‌లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్
Best Scooters Under Rs 80000: రూ.80 వేలలోపు బెస్ట్ స్కూటీలు ఇవే - హోండా, హీరో, టీవీఎస్, ఎలక్ట్రిక్ కూడా!
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం