By: ABP Desam | Updated at : 08 Jul 2022 11:11 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
Stock Market Opening Bell 8 July 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు మెరుగ్గా ఓపెనవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. క్రూడాయిల్ ధరలు తగ్గడం, రూపాయి బలోపేతానికి ఆర్బీఐ చర్యలు తీసుకోవడంతో సూచీలు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 75 పాయింట్ల లాభంతో 16,208, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 277 పాయింట్ల లాభంతో 54,445 వద్ద చలిస్తున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 54,178 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 54,574 వద్ద లాభాల్లో మొదలైంది. 54,350 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,625 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 277 పాయింట్ల లాభంతో 54,455 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 16,139 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,273 వద్ద ఓపెనైంది. 16,177 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,257 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 75 పాయింట్ల లాభంతో 16,208 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 35,258 వద్ద మొదలైంది. 35,068 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,149 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 228 పాయింట్ల లాభంతో 35,149 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ఉన్నాయి. ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెటల్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా మిగతా సూచీలన్నీ లాభాల్లో కదలాడుతున్నాయి. మీడియా ఒక శాతం కన్నా ఎక్కువగా ఎగిశాయి.
Monthly Income: మ్యూచువల్ ఫండ్ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్
Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది
Mutual Fund SIPs: 'సిప్' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు
Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్ వచ్చాయి, సిప్ చేసిన మ్యాజిక్ ఇది
Loan On Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ తీసుకోవచ్చు, వడ్డీ కూడా తక్కువే!
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
/body>