Stock Market Opening 31 July 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం పాజిటివ్‌గా మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 49 పాయింట్లు పెరిగి 19,696 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 176 పాయింట్లు ఎగిసి 66,336 వద్ద కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,160 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,156 వద్ద మొదలైంది. 65,998 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,343 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 176 పాయింట్ల లాభంతో 66,336 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,646 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,666 వద్ద ఓపెనైంది. 19,597 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,699 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 49 పాయింట్లు పెరిగి 19,696 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 45,546 వద్ద మొదలైంది. 45,359 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,581 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 101 పాయింట్లు పెరిగి 45,569 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్ మినహా మిగతా సూచీలు పెరిగాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కళకళలాడుతున్నాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.60,280 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.77000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.24,590 వద్ద కొనసాగుతోంది.
Also Read: ఆగస్టులో బ్యాంకులు 14 రోజులు పని చేయవు, ఈ లిస్ట్ సేవ్ చేసుకోండి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.