Stock Market Opening 18 October 2022: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ఓపెనయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న ఆర్బీఐ వ్యాఖ్యలు, డాలర్ బలం కాస్త తగ్గడం, అమెరికా మార్కెట్ల ర్యాలీ పాజిటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 165 పాయింట్ల లాభంతో 17,477 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 560 పాయింట్ల లాభంతో 58,971 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 58,410 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,744 వద్ద లాభాల్లో మొదలైంది. 58,744 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,143 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 560 పాయింట్ల లాభంతో 58,971 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
సోమవారం 17,311 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మగ 17,438 వద్ద ఓపెనైంది. 17,434 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,527 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 165 పాయింట్ల లాభంతో 17,477 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 40,252 వద్ద మొదలైంది. 40,139 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,361 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 341 పాయింట్ల లాభంతో 40,262 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 44 కంపెనీలు లాభాల్లో 6 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సెమ్, ఎల్‌టీ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి. ఫార్మా, హెల్త్‌కేర్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ ఒక శాతానికి పైగా పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.