Stock Market @ 12 PM 6 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో ఉదయం సూచీలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఆ తర్వాత కాస్త తగ్గి రేంజ్‌బౌండ్‌లో కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 71 పాయింట్ల లాభంతో 15,927, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 240 పాయింట్ల లాభంతో 53,373 వద్ద కొనసాగుతున్నాయి. 


BSE Sensex


క్రితం సెషన్లో 53,134 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,170 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. 53,143 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,584 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 240 పాయింట్ల లాభంతో 53,373 వద్ద కొనసాగుతోంది.  


NSE Nifty


మంగళవారం 15,798 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 15,818 వద్ద ఓపెనైంది. 15,800 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,927 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 71 పాయింట్ల లాభంతో 15,927 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 33,929 వద్ద మొదలైంది. 33,876 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,254 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 367 పాయింట్ల లాభంతో 34,183 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బ్రిటానియా, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఐచర్‌ మోటార్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, హిందాల్కో, పవర్‌ గ్రిడ్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌, మీడియా రంగాల సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి.