Stock Market Closing 20 October 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు అందాయి. ఉదయం నుంచి ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు సాయంత్రానికి లాభాల్లోకి వచ్చేశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 51 పాయింట్ల లాభంతో 17,563 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 95 పాయింట్ల లాభంతో 59,202 వద్ద ముగిశాయి. రూపాయి 26 పైసలు బలపడి 82.75 వద్ద స్థిరపడింది. 


BSE Sensex


క్రితం సెషన్లో 59,107 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,824 వద్ద లాభాల్లో మొదలైంది. 58,791 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,273 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 95 పాయింట్ల లాభంతో 59,202 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 17,512 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,423 వద్ద ఓపెనైంది. 17,421 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,584 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 51 పాయింట్ల లాభంతో 17,563 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 40,149 వద్ద మొదలైంది. 39,848 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,208 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 273 పాయింట్ల నష్టంతో 40,099 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ముగిశాయి. యూపీఎల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, అపోలో హాస్పిటల్స్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ రంగాల సూచీలు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.