Stock Market Closing Bell 07 September 2022: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. ఉదయం అమ్మకాలు చేపట్టిన మదుపర్లు ఐరోపా మార్కెట్లు తెరిచాక కొనుగోళ్లు చేశారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 31 పాయింట్ల నష్టంతో 17,624 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 168 పాయింట్ల నష్టంతో 59,028 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 6 పైసలు తగ్గి 79.90 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 59,196 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,789 నష్టాల్లో మొదలైంది. 58,722 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,166 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 168 పాయింట్ల నష్టంతో 59,028 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 17,655 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,483 వద్ద ఓపెనైంది. 17,484 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,650 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 31 పాయింట్ల నష్టంతో 17,624 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ముగిసింది. ఉదయం 39,337 వద్ద మొదలైంది. 39,258 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,572 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 210 పాయింట్ల నష్టంతో 39,455 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ముగిశాయి. శ్రీ సెమ్, అల్ట్రాటెక్ సెమ్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, మారుతీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్ ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్ సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.