Stock Market @12 PM 04 November 2022: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే వచ్చాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టడంతో సూచీలు దిద్దుబాటుకు గురవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 12 పాయింట్ల నష్టంతో 18,039 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 112 పాయింట్ల నష్టంతో 60,724 వద్ద ఉన్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 60,836 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,698 వద్ద మొదలైంది. 60,666 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,989 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 112 పాయింట్ల నష్టంతో 60,724 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


గురువారం 18,052 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,053 వద్ద ఓపెనైంది. 18,017 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,108 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 పాయింట్ల నష్టంతో 18,039 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 41,314 వద్ద మొదలైంది. 41,088 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,516 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 159 పాయింట్ల నష్టంతో 41,138 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 27 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. హీరో మోటోకార్ప్‌, ఇన్‌పీ, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు నష్టపోయాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.