Stock Market Closing 03 November 2022: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 30 పాయింట్ల నష్టంతో 18,052 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 69 పాయింట్ల నష్టంతో 60,836 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలహీనపడి 82.89 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,511 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,511 వద్ద మొదలైంది. 60,485 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,994 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 69 పాయింట్ల నష్టంతో 60,836 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 18,082 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,968 వద్ద ఓపెనైంది. 17,959 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,106 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 30 పాయింట్ల నష్టంతో 18,052 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 40,873 వద్ద మొదలైంది. 40,819 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,478 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 151 పాయింట్ల లాభంతో 41,298 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, టైటాన్, యూపీఎల్, బజాజ్ ఆటో, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, హిందాల్కో, పవర్ గ్రిడ్, ఐచర్ మోటార్స్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు స్వల్పంగా పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.