Stock Market Opening 02 November 2022: స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచుతుందన్న ఆందోళనతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్లు డీలాపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 62 పాయింట్ల నష్టంతో 18,082 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 215 పాయింట్ల నష్టంతో 60,906 వద్ద ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 61,121 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,156 వద్ద మొదలైంది. 60,794 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,209 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 215 పాయింట్ల నష్టంతో 60,906 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 18,145 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,177 వద్ద ఓపెనైంది. 18,048 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,178 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 62 పాయింట్ల నష్టంతో 18,082 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లోంచి నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 41,472 వద్ద మొదలైంది. 41,060 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,474 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 142 పాయింట్ల నష్టంతో 41,146 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 15 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, హిందాల్కో, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఐచర్‌ మోటార్స్‌, మారుతీ,  అపోలో హాస్పిటల్‌, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియాల్టీ,  కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు పతనమయ్యాయి. మీడియా, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.