Stock Market Closing 01 November 2022: నవంబర్ నెల మొదటి రోజు స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. బ్యాంకు, ఫైనాన్స్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 133 పాయింట్ల లాభంతో 18,145 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 374 పాయింట్ల లాభంతో 61,121 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలపడి 82.70 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,746 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 61,065 వద్ద మొదలైంది. 60,868 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,289 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 374 పాయింట్ల లాభంతో 61,121 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 18,012 వద్ద ముగిసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ మంగళవారం 18,151 వద్ద ఓపెనైంది. 18,060 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,175 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 133 పాయింట్ల లాభంతో 18,145 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్పంగా నష్టపోయింది. ఉదయం 41,552 వద్ద మొదలైంది. 41,188 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,677 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 18 పాయింట్ల నష్టంతో 41,289 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, దివిస్ ల్యాబ్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, ఐచర్ మోటార్స్, మారుతీ, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, మీడియా సూచీ పతనమయ్యాయి. ఐటీ, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఒక శాతం కన్నా ఎక్కువే ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.