By: ABP Desam | Updated at : 14 Oct 2022 04:03 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 14 October 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. అమెరికా మార్కెట్ల దన్నుతో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 169 పాయింట్ల లాభంతో 17,183 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 684 పాయింట్ల లాభంతో 57,919 వద్ద ముగిశాయి. ఉదయం వెయ్యి పాయింట్ల మేర లాభపడ్డ సెన్సెక్స్ లాభాల స్వీకరణతో సగం వరకు తగ్గింది. రూపాయి ఒక పైసా నష్టపోయి 82.36 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 57,235 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,162 వద్ద లాభాల్లో మొదలైంది. 57,848 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,435 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 684 పాయింట్ల లాభంతో 57,919 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 17,014 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,322 వద్ద ఓపెనైంది. 17,169 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,348 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 169 పాయింట్ల లాభంతో 17,183 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీగా లాభపడింది. ఉదయం 39,446 వద్ద మొదలైంది. 39,196 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,570 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 658 పాయింట్ల లాభంతో 39,282 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, ఎం అండ్ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, బీపీసీఎల్ షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, మెటల్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!