Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం భారీ లాభాల్లో మగిశాయి. చైనాలో కరోనా కేసులు తగ్గిపోవడం, లాక్‌డౌన్లు ఎత్తివేయడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. మైక్రో ఎకానమీ గ్రోత్ కనిపించడం, పన్ను ఆదాయం పెరగడం వంటి సానుకూల సెంటిమెంటుకు దారితీశాయి. టెక్నికల్‌గానూ మార్కెట్లు కాస్త ఎక్కువే పతనం కావడంతో ఇప్పుడు పుల్‌బ్యాక్ లభించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,842 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1344 పాయింట్లు నష్టపోయింది. మొత్తంగా ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్లు రూ.7 లక్షల కోట్ల వరకు సంపద పోగేశారు.
BSE Sensex
క్రితం సెషన్లో 52973 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,285 వద్ద లాభాల్లో మొదలైంది. 53,176 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఉదయం నుంచే కొనుగోళ్ల మద్దతు లభించడంతో ౫౪,౩౯౯ వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1344 పాయింట్ల లాభంతో 54,318 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 15,842 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 15,977 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే లాభాల బాట పట్టింది. 15,900 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. జోరుగా కొనుగోళ్లు సాగడంతో 16,284 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 438 పాయింట్లు లాభపడింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో మొదలైంది. ఉదయం 33,796 వద్ద మొదలైంది. 33,680 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,366 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 704 పాయింట్ల లాభంతో 34,301 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 50 కంపెనీలు లాభాల్లోనే ముగిశాయి. హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ భారీగా లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు 1-3 శాతం వరకు ఎగిశాయి. మెటల్ సూచీ మాత్రం ఏకంగా 7 శాతం రాణించింది.