By: ABP Desam | Updated at : 19 May 2022 10:13 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Opening Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆరంభం నుంచే అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను తెగనమ్ముతున్నారు. అమెరికా, జపాన్, చైనా, సింగపూర్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోవడంతో మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ముఖ్యంగా ఐటీ షేర్ల పతనం కలవరపరుస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 15,940 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 100 పాయింట్ల వరకు నష్టాల్లో ఉంది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.5 లక్షల కోట్ల వరకు నష్టపోయారు.
BSE Sensex
క్రితం సెషన్లో 54,208 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,070 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 53,053 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఉదయం నుంచే అమ్మకాల వెల్లువతో సూచీ నేల చూపులు చూస్తోంది. 53,356 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 100 పాయింట్ల నష్టంతో 53,220 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 16,240 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 15,917 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే నష్టాల బాట పట్టింది. 15,903 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,984 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 300 పాయింట్లు నష్టపోయి 15,940 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ఉంది. ఉదయం 33,461 వద్ద మొదలైంది. 33,387 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,633 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 645 పాయింట్ల నష్టంతో 33,515 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 2 కంపెనీలు లాభాల్లో 48 నష్టాల్లో ఉన్నాయి. ఐటీసీ, ఐచర్ మోటార్స్ లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫీ, విప్రో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసీఎస్ 4 శాతం వరకు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ, ఆటో, మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్‌ను ఇన్వెస్టర్లు తెగనమ్ముతున్నారు. పతనం ఇంకా కొనసాగే అవకాశం ఉంది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Jio Best Prepaid Plan: జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!