Stock Market @ 12 PM,  13 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం బలం చూపిస్తున్నాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను వెంటాడినా డొమస్టిక్‌ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడంతో నష్టాల నుంచి తేరుకుంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 62 పాయింట్ల నష్టంతో 18,008 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 227 పాయింట్ల నష్టంతో 60,348 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 60,571 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,417 వద్ద నష్టాల్లో మొదలైంది. 59,417 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,378 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 227 పాయింట్ల నష్టంతో 60,348 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


మంగళవారం 18,070 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,771 వద్ద ఓపెనైంది. 17,771 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,015 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 62 పాయింట్ల నష్టంతో 18,008 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ మాత్రం భారీ లాభాల్లో ఉంది.  ఉదయం 40,308 వద్ద మొదలైంది. 40,288 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,252 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 339 పాయింట్ల లాభంతో 41,212 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో షేర్లు నష్టపోయాయి. ఐటీ, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేట్‌ బ్యాంకు షేర్లకు డిమాండ్‌ ఉంది. ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, హెల్త్‌కేర్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.