Stock Market Closing 29 September 2023:
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. గురువారం నాటి నష్టాలను కొంత పూడ్చాయి. క్రూడాయిల్ ఫ్యూచర్స్ తగ్గడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. పైగా పెరిగిన ముడి చమురు ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువగానే ఉంటుందని నిపుణులు చెప్పడం ఊరటనిచ్చింది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్లు పెరిగి 19,638 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 320 పాయింట్లు ఎగిసి 65,828 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 83.04 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,743 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,508 వద్ద మొదలైంది. 65,570 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,151 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 320 పాయింట్లు పెరిగి 65,828 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 19,523 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,581 వద్ద ఓపెనైంది. 19,551 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,726 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 114 పాయింట్లు ఎగిసి 19,638 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ పెరిగింది. ఉదయం 44,445 వద్ద మొదలైంది. 44,344 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,755 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 283 పాయింట్ల లాభంతో 44,584 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటో, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.58,530 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.74,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.660 పెరిగి రూ.24,370 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు గురువారం ఘోర పతనాన్ని చవిచూశాయి. క్రూడాయిల్ బ్యారెల్ ధర 97 డాలర్లకు పెరగడం ఇన్వెస్టర్లలో నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. మరికొన్ని రోజుల్లోనే 100 డాలర్లకు చేరుకుంటుందన్న అంచనాలతో వారు అమ్మకాలు చేపట్టారు. దీనికి తోడు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను అత్యధిక స్థాయిలోనే ఉంచుతాయన్న వార్తలు చేటు చేశాయి. ఆసియా, ఐరోపాలో మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలపడి 83.19 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 610, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 193 పాయింట్ల మేర పతనమయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.