Stock Market Opening 29 September 2023:


భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆసియా నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 85 పాయింట్లు పెరిగి 19,608 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 241 పాయింట్లు ఎగిసి 65,733 వద్ద కొనసాగుతున్నాయి. నేడు అన్ని రంగాల సూచీలు ఎగిశాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,743 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,508 వద్ద మొదలైంది. 65,570 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,761 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 241 పాయింట్లు పెరిగి 65,733 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


గురువారం 19,523 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,581 వద్ద ఓపెనైంది. 19,551 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,612 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 85 పాయింట్లు ఎగిసి 19,608 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ పెరిగింది. ఉదయం 44,445 వద్ద మొదలైంది. 44,344 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,628 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 256 పాయింట్ల లాభంతో 44,557 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, హిందాల్కో, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు లాభపడ్డాయి. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఇన్ఫీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మీడియా, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు కళకళలాడుతున్నాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.58,530 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.74,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.660 పెరిగి రూ.24,370 వద్ద ఉంది.


క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?


భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం ఘోర పతనాన్ని చవిచూశాయి. క్రూడాయిల్‌ బ్యారెల్ ధర 97 డాలర్లకు పెరగడం ఇన్వెస్టర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. మరికొన్ని రోజుల్లోనే 100 డాలర్లకు చేరుకుంటుందన్న అంచనాలతో వారు అమ్మకాలు చేపట్టారు. దీనికి తోడు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను అత్యధిక స్థాయిలోనే ఉంచుతాయన్న వార్తలు చేటు చేశాయి. ఆసియా, ఐరోపాలో మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలపడి 83.19 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 610, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 193 పాయింట్ల మేర పతనమయ్యాయి.


క్రితం సెషన్లో 66,118 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,406 వద్ద మొదలైంది. కాసేపు ఫ్లాట్‌గా చలిచింది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు పెరిగాయన్న వార్తలు రాగానే పతనం మొదలైంది. ఆరంభ స్థాయి వద్దే గరిష్ఠాన్ని నమోదు చేసిన సూచీ 65,423 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 610 పాయింట్లు పతనమై 65,503 వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు నేడు ఒక్కరోజే రూ.3 లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు. గురువారం ఉదయం 19,761 వద్ద ఆరంభమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,766 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆపై 19,429 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. మొత్తంగా 192 పాయింట్లు నష్టపోయి 19,523 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ 287 పాయింట్లు ఎరుపెక్కి 44,300 వద్ద ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.