Stock Market Closing 27 September 2023:
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు చివరికి గరిష్ఠాల్లోనే ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణం వంటివి కలవరపెట్టినా.. స్థానిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, వృద్ధి సాధించడం, ఎర్నింగ్స్ సీజన్ మొదలవ్వడంతో ఇన్వెస్టర్లు పాజిటివ్ సెంటిమెంటుతో కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 51 పాయింట్లు పెరిగి 19,716 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 173 పాయింట్లు ఎగిసి 66,118 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.23 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,945 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,925 వద్ద మొదలైంది. 65,549 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,172 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 173 పాయింట్లు పెరిగి 66,118 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 19,664 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,637 వద్ద ఓపెనైంది. 19,554 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,730 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 51 పాయింట్లు ఎగిసి 19,716 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ తగ్గింది. ఉదయం 44,465 వద్ద మొదలైంది. 44,182 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,668 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 35 పాయింట్ల నష్టంతో 44,588 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. ఎల్‌టీ (2.01%), కోల్ ఇండియా (1.81%), ఐటీసీ (1.56%), సిప్లా (1.41%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (1.33%) షేర్లు లాభపడ్డాయి. టైటాన్ (1.38%), గ్రాసిమ్ (1.31%), హీరోమోటో (0.90%), ఎస్బీఐ (0.74%), ఐసీఐసీఐ బ్యాంకు (0.71%) నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్ సూచీలు స్వల్పంగా ఎరుపెక్కాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్ రంగాలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.59,450 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.600 తగ్గి రూ.74,200 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.50 తగ్గి రూ.24,140 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 9 పాయింట్లు తగ్గి 19,664 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 78 పాయింట్లు తగ్గి 65,945 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 83.15 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.