By: ABP Desam | Updated at : 22 Sep 2023 04:01 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 22 September 2023:
భారత స్టాక్ మార్కెట్లు వరుస నాలుగో రోజు నష్టపోయాయి. రోజు మొత్తం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆరంభంలో నష్టపోయిన సూచీలు ఆసియా మార్కెట్లు పుంజుకోవడంతో రీబౌండ్ అయ్యాయి. ఐరోపా స్టాక్స్ పడిపోవడం, యూఎస్ వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 68 పాయింట్లు తగ్గి 19,674 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 221 పాయింట్లు తగ్గి 66,009 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 82.94 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,230 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,215 వద్ద మొదలైంది. 65,952 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,445 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 221 పాయింట్లు తగ్గి 66,009 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 19,742 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,744 వద్ద ఓపెనైంది. 19,657 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,792 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 68 పాయింట్లు తగ్గి 19,674 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 44,707 వద్ద మొదలైంది. 44,548 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,996 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 11 పాయింట్ల నష్టంతో 44,612 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.86%), ఎస్బీఐ (1.79%), మారుతీ (2.61%), ఏసియన్ పెయింట్స్ (1.12%), ఎం అండ్ ఎం (1.69%) షేర్లు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ (2.32%), విప్రో (2.44%), యూపీఎల్ (1.83%), సిప్లా (1.66%), బజాజ్ ఆటో (1.58%) షేర్లు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్, ఆటో మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఫైనాన్స్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ రంగాలు పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.210 తగ్గి రూ.59,840 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.75,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.24,640 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
క్రితం సెషన్లో 66,800 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 66,608 వద్ద మొదలైంది. ఆరంభం నుంచే నష్టాల్లోకి జారుకుంది. 66,128 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. చివరికి 570 పాయింట్ల నష్టంతో 66,230 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌కు ఆరంభ స్థాయే గరిష్ఠం కావడం గమనార్హం. గురువారం 19,840 వద్ద మొదలైన నిఫ్టీ 19,848 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 19,709 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ మొత్తంగా 159 పాయింట్లు పతనమై 19,742 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ ఏకంగా 760 పాయింట్లు నష్టపోయి 44,623 వద్ద ముగిసింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.09 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Tirumala News: తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
Crime News: కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..