By: Rama Krishna Paladi | Updated at : 03 Jul 2023 12:48 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market @12 PM, 3 July 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయిల్లో మొదలయ్యాయి. ప్రతి రోజూ లైఫ్ టైమ్ హై టచ్ చేస్తున్నాయి. నేటి మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 118 పాయింట్లు పెరిగి 19,307 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 456 పాయింట్లు పెరిగి 65,175 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ తొలిసారిగా 65,000 మైలురాయిని క్రాస్ చేసింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 64,718 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 64,836 వద్ద మొదలైంది. 64,836 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,240 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 456 పాయింట్ల లాభంతో 65,175 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,189 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,246 వద్ద ఓపెనైంది. 19,234 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,336 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 118 పాయింట్ల లాభంతో 19,307 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,957 వద్ద మొదలైంది. 44,882 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,353 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 387 పాయింట్లు పెరిగి 45,134 వద్ద నడుస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. బీపీసీఎల్, గ్రాసిమ్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్ నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.88 తగ్గి రూ.58,960గా ఉంది. కిలో వెండి రూ.71,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.20 తగ్గి రూ.23,810 వద్ద ఉంది.
Also Read: కేవలం ₹100కే రైల్వే స్టేషన్‌లో రూమ్ - హోటల్ గదిలా ఉంటుంది
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations to Gensol Engineering Limited on getting listed on NSE today.#NSE #NSEIndia #listing #IPO #StockMarket #ShareMarket #GensolEngineeringLimited @ashishchauhan pic.twitter.com/jVNp9WsvCK
— NSE India (@NSEIndia) July 3, 2023
Let us be grateful to all those who inspired us, shared their wisdom and widen our horizons. Happy Guru Purnima!#NSE #NSEIndia #GuruPurnima @ashishchauhan pic.twitter.com/qgp8YyNv0e
— NSE India (@NSEIndia) July 3, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్