Stock Market Opening 30 January 2023:


భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. హిండెన్‌బర్గ్‌కు అదానీ గ్రూప్ ఘాటుగా బదులివ్వడం మార్కెట్‌ వర్గాల్లో సందిగ్ధం నెలకొంది. ఏదేమైనా మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 40 పాయింట్ల లాభంతో 17,564 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 90 పాయింట్ల నష్టంతో 59,299 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు నాలుగు శాతం లాభపడటం గమనార్హం.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 59,330 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,101 వద్ద మొదలైంది. 58,706 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,644 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 90 పాయింట్ల నష్టంతో 59,299 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 17,604 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,541 వద్ద ఓపెనైంది. 17,446 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,709 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 40 పాయింట్ల నష్టంతో 17,564 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 39,856 వద్ద మొదలైంది. 39,658 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,789 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 300 పాయింట్లు తగ్గి 40,045 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అపోలో హాస్పిటల్స్‌, బజాజ్‌ ఆటో, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఫార్మా సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు పతనమయ్యాయి. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


అదానీ ఎంటర్‌ప్రైజెస్: షేర్ ధరల్లో తీవ్ర పతనం, శుక్రవారం ప్రారంభమైన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు (FPO) పెద్దగా ప్రతిస్పందన లేకపోవడం వంటి కారణాలతో అందరి దృష్టి ఈ రోజు ఈ స్టాక్ కదలికపైనే ఉంటుంది. ఆఫర్ ధరలో కోత, FPO సబ్‌స్క్రిప్షన్ కోసం టైమ్‌లైన్ పొడిగింపును బ్యాంకర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారమే FPO జరుగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో భాగంగా ఉన్న అదానీ గ్రూప్ స్టాక్స్‌కు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై అభిప్రాయాలు చెప్పాలని మార్కెట్ పార్టిసిపెంట్లను గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ MSCI Inc కోరింది.


NTPC: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్వతంత్ర నికర లాభం 5.4% పెరిగి రూ. 4,476.25 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం ఏడాదికి (YoY) 37% పెరిగి రూ. 41,410.50 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరు మీద రూ. 4.25 మధ్యంతర డివిడెండ్‌ను కూడా బోర్డు ఆమోదించింది.


L&T: 2022 డిసెంబరు త్రైమాసిక ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి ఈ కంపెనీ బోర్డు ఇవాళ సమావేశమవుతుంది. సంవత్సరానికి 16% వృద్ధితో రూ. 45,882 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని, 5% వృద్ధితో రూ. 2,615 నికర లాభాన్ని ఈ కంపెనీ ప్రకటిస్తుందని మార్కెట్ అంచనా వేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.