Stock Market Opening 29 November 2022:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధం లేకుండా సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. ఆల్‌టైమ్ హై దిశగా ఎగబాకుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 86 పాయింట్ల లాభంతో 18,649 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 301 పాయింట్ల లాభంతో 62,806 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 62,504 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,362 వద్ద మొదలైంది. 62,362 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,849 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 301 పాయింట్ల లాభంతో 62,806 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 18,562 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,649 వద్ద ఓపెనైంది. 18,552 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,662 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 86 పాయింట్ల లాభంతో 18,649 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 42,959 వద్ద మొదలైంది. 42,959 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,279 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 199 పాయింట్ల లాభంతో 43,220 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 13 నష్టాల్లో ఉన్నాయి. హిందుస్థాన్ యునీలివర్, హిందాల్కో, హీరోమోటో కార్ప్, నెస్లే ఇండియా, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఎల్‌టీ నష్టపోయాయి. మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ ఎక్కువగా లాభపడ్డాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.