Stock Market Closing 23 November 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 23 పాయింట్ల లాభంతో 18,267 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 91 పాయింట్ల లాభంతో 61,510 వద్ద ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకు షేర్లకు గిరాకీ పెరిగింది.


BSE Sensex


క్రితం సెషన్లో 61,418 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,779 వద్ద మొదలైంది. 61,442 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,780 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 91 పాయింట్ల లాభంతో 61,510 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 18,244 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,325 వద్ద ఓపెనైంది. 18,246 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,325 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 23 పాయింట్ల లాభంతో 18,267 వద్ద స్థిరపడింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 42,668 వద్ద మొదలైంది. 42,556 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,860 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 272 పాయింట్ల లాభంతో 42,729 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ముగిశాయి. అపోలో హాస్పిటల్స్‌, హెచ్డీఎఫ్‌సీ లైఫ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, హీరో మోటోకార్ప్‌, పవర్‌ గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా నష్టపోయాయి. ఐటీ, మెటల్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌ రంగాల సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.