Stock Market Closing 22 November 2022: ఒడుదొడులకు తెరపడింది. భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 84 పాయింట్ల లాభంతో 18,244 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 274 పాయింట్ల లాభంతో 61,418 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు బలపడి 81.67 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 61,144 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,126 వద్ద మొదలైంది. 61,073 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,466 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 274 పాయింట్ల లాభంతో 61,418 వద్ద ముగిసింది.


NSE Nifty


సోమవారం 18,159 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,179 వద్ద ఓపెనైంది. 18,137 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,261 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.  మొత్తంగా 84 పాయింట్ల లాభంతో 18,244 వద్ద స్థిరపడింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ మోస్తరు లాభపడింది. ఉదయం 42,467 వద్ద మొదలైంది. 42,347 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,508 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 110 పాయింట్ల లాభంతో 42,457 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్ గ్రిడ్‌ కొటక్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. రియాల్టీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.