Stock Market Closing 18 November 2022: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో మొదట్లో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఐరోపా మార్కెట్లు తెరిచాక కొనుగోళ్లకు దిగారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 36 పాయింట్ల నష్టంతో 18,307 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 87 పాయింట్ల నష్టంతో 61,663 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలహీన పడి 81.68 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 61,750 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,858 వద్ద మొదలైంది. 61,337 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,929 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 335 పాయింట్ల నష్టంతో నిలిచింది. ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక సెన్సెక్స్‌ రికవరీ బాట పట్టింది. కేవలం 87 పాయింట్ల నష్టంతో 61,663 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 18,343 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,382 వద్ద ఓపెనైంది. 18,209 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,394 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. 100 పాయింట్లకు పైగా నష్టం నుంచి తేరుకొని 36 పాయింట్ల నష్టంతో 18,307 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్పంగా నష్టపోయింది. ఉదయం 42,545 వద్ద మొదలైంది. 42,223 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,590 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 20 పాయింట్ల నష్టంతో 42,437 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 14 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్ యునీలివర్‌, ఎస్‌బీఐ, ఇన్ఫీ షేర్లు లాభపడ్డాయి. ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంకు సూచీ అదరగొట్టింది. మిగత రంగాల సూచీలు నష్టపోయాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.