Top 10 Retirement Mutual Fund Schemes: పదవీ విరమణ పొందే సమయానికి సరిపడా కార్పస్‌ దగ్గరుంటే ఉండే భరోసాయే వేరు! సాధారణంగా రిటైర్మెంట్‌ కార్పస్‌ కోసం చాలామంది పెన్షన్‌ పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఇందులో వచ్చే వడ్డీరేటు సగటున 7-8 శాతం వరకే ఉంటుంది. అందుకే వీటికి అదనంగా రిటైర్మెంట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెడితే మెరుగైన రాబడి లభిస్తుంది. సుదీర్ఘ కాలం మదుపు చేస్తారు కాబట్టి మార్కెట్‌ ఒడుదొడుకుల భయం ఉండదు. స్కీమ్‌ ఆరంభం నుంచి చక్కని రాబడి ఇచ్చిన రిటైర్మెంట్‌ ఫండ్లు ఇవే!


ఎస్‌బీఐ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఫండ్‌ - అగ్రెసివ్‌ ప్లాన్‌: ఈ పథకం డైరెక్టన్‌ ప్లాన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు వార్షికంగా 23.37 శాతం రాబడి ఇచ్చింది. ఇందులోనే రెగ్యులర్‌ ప్లాన్‌ ఇచ్చిన రిటర్న్‌ 21.56 శాతంగా ఉంది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 500 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ఇది ట్రాక్‌ చేస్తుంది.


ఎస్‌బీఐ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఫండ్‌ - అగ్రెసివ్‌ హైబ్రీడ్‌ ప్లాన్‌: ఇందులో డైరెక్ట్‌ ప్లాన్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు 20.13 శాతం రాబడి అందించింది. ఇక రెగ్యులర్‌ స్కీమ్‌ అయితే 18.53 శాతం రిటర్న్‌ ఇచ్చింది. క్రిసిల్‌ హైబ్రీడ్‌ 35+65 అగ్రెసివ్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది.


హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఫండ్‌ - ఈక్విటీ ప్లాన్‌: ఇందులో డైరెక్ట్‌ ప్లాన్‌ ఆరంభం నుంచి వార్షికంగా 20.12% లాభం ఇచ్చింది. ఇక రెగ్యులర్‌ ప్లాన్‌ అయితే 18.44 శాతం రాబడి అందించింది. నిఫ్టీ 500 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ఇది ఫాలో అవుతుంది.


ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ రిటైర్మెంట్‌ ఫండ్‌ - ప్యూర్‌ ఈక్విటీ ప్లాన్‌: ఇందులో డైరెక్టర్‌ ప్లాన్‌ వార్షికంగా 18.71 శాతం రిటర్న్‌ ఇవ్వగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్‌ ఫండ్‌ రెగ్యులర్‌ ప్లాన్‌ 16.78 శాతం అందించింది. ఈ ఫండ్‌ సైతం నిఫ్టీ 500నే ట్రాక్ చేస్తుంది.


హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్‌ సేవింగ్‌ ఫండ్‌ - హైబ్రీడ్‌ ఈక్విటీ ప్లాన్‌: ఇందులో డైరెక్ట్‌ ప్లాన్ వార్షికంగా 17.01 శాతం రిటర్న్‌ ఇవ్వగా రెగ్యులర్ ప్లాన్ 15.37 శాతం అందించింది. ఈ స్కీమ్‌ నిఫ్టీ 50 హైబ్రీడ్‌ కాంపోసిట్‌ డెట్‌ 65:35 ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది.


టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ మోడరేట్‌: ఈ స్కీమ్‌ డైరెక్ట్‌ ప్లాన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు వార్షికంగా 15.35 శాతం రిటర్న్‌ ఇచ్చింది. ఇక రెగ్యులర్‌ ప్లాన్‌ అయితే 14.18 శాతం అందించింది. క్రిసిల్‌ హైబ్రీడ్‌ 25+75 అగ్రెసివ్‌ ఇండెక్స్‌ను ఈ పథకం ట్రాక్‌ చేస్తుంది.


టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ప్రొగ్రెసివ్‌:  ఇందులో డైరెక్ట్‌ ప్లాన్ వార్షిక ప్రాతిపదికన 15.24 శాతం రిటర్న్‌ ఇవ్వగా రెగ్యులర్ ప్లాన్ 14.04 శాతం అందించింది. నిఫ్టీ 500 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ఈ స్కీమ్‌ ట్రాక్‌ చేస్తుంది.


ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ రిటైర్మెంట్‌ ఫండ్‌ - హైబ్రీడ్‌ అగ్రెసివ్‌ ప్లాన్‌: ఇందులో డైరెక్ట్‌ ప్లాన్‌ ఏటా 14.27 శాతం రాబడి అందించింది. ఇక రెగ్యులర్‌ ప్లాన్‌ 12.39 శాతం రిటర్న్‌ ఇచ్చింది. క్రిసిల్‌ హైబ్రీడ్‌ 35+65 అగ్రెసివ్‌ ఇండెక్స్‌ను ఫాలో అవుతుంది.


యాక్సిస్‌ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఫండ్‌ - డైనమిక్ ప్లాన్‌: ఇందులో డైరెక్ట్‌ ప్లాన్ వార్షికంగా 12.88% రాబడి అందించగా రెగ్యులర్‌ ప్లాన్ 10.85% రిటర్న్‌ ఆఫర్‌ చేసింది. నిఫ్టీ 50 హైబ్రీడ్‌ కాంపోసిట్‌ డెట్‌ 65:35 ఇండెక్స్‌ను ఈ స్కీమ్‌ ట్రాక్‌ చేస్తుంది.


ఎస్‌బీఐ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఫండ్‌ - కన్జర్వేటివ్‌ హైబ్రీడ్‌ ప్లాన్ : ఇందులో డైరెక్ట్‌ ప్లాన్ ఆరంభం నుంచి 11.27% రిటర్న్‌ ఇచ్చింది. ఇక రెగ్యులర్‌ ప్లాన్‌ 10.42 శాతం ఆఫర్‌ చేసింది. ఈ స్కీమ్‌ క్రిసిల్‌ హైబ్రీడ్‌ 65+35 కన్జర్వేటివ్‌ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.