Stock Market @ 12 PM, 18 November 2022: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలే అందాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ట్రేడైన సూచీలు మధ్యాహ్నానికి నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 98 పాయింట్ల నష్టంతో 18,394 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 335 పాయింట్ల నష్టంతో 61,414 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 61,750 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,858 వద్ద మొదలైంది. 61,357 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,929 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 335 పాయింట్ల నష్టంతో 61,414 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


గురువారం 18,343 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,382 వద్ద ఓపెనైంది. 18,220 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,394 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 98 పాయింట్ల నష్టంతో 18,244 వద్ద చలిస్తోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప నష్టాల్లో ఉంది. ఉదయం 42,545 వద్ద మొదలైంది. 42,258 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,590 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 107 పాయింట్ల నష్టంతో 42,350 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 7 కంపెనీలు లాభాల్లో 42 నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, దివిస్‌ ల్యాబ్‌, టాటా మోటార్స్‌, హిందుస్థాన్ యునీలివర్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్‌ నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ మినహా అన్ని రంగాల సూచీలు కుదేలయ్యాయి. ఆటో, ఐటీ, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎక్కువ నష్టపోయాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.