Stock Market Closing 17 November 2022: స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలే అందడంతో ఉదయం నుంచీ ఫ్లాట్‌గా ట్రేడ్‌ అయ్యాయి. ఐరోపా మార్కెట్లు తెరవగానే నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 65 పాయింట్ల నష్టంతో 18,343 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 230 పాయింట్ల లాభంతో 61,750 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 35 పైసలు బలహీన పడి 81.65 వద్ద స్థిరపడింది 


BSE Sensex


క్రితం సెషన్లో 61,980 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,812 వద్ద మొదలైంది. 61,643 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,050 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం నుంచీ ఫ్లాట్‌గా ట్రేడైనా ఐరోపా మార్కెట్లు తెరవగానే 230 పాయింట్ల నష్టంతో 61,750 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 18,409 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,358 వద్ద ఓపెనైంది. 18,312 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,417 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 65 పాయింట్ల నష్టంతో 18,343 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్పంగా నష్టపోయింది. ఉదయం 42,399 వద్ద మొదలైంది. 42,366 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,662 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 77 పాయింట్ల నష్టంతో 42,458 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభాల్లో 37 నష్టపోయాయి. టాటా కన్జూమర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎల్‌టీ, పవర్‌గ్రిడ్‌, హెచ్డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌, ఐచర్‌ మోటార్స్‌, అపోలో హాస్పిటల్స్‌ నష్టపోయాయి. రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్‌ మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎరుపెక్కాయి. ఆటో, మీడియా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ ఒక శాతానికి పైగా పతనమయ్యాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.