Stock Market Opening 27 July 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం పాజిటివ్‌గా మొదలయ్యాయి. యూఎస్ ఫెడ్ సమీక్ష తర్వాత మదుపర్లు ఆత్మవిశ్వాసంతో కొనుగోళ్లు చేపట్టారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 31 పాయింట్లు పెరిగి 19,810 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 51 పాయింట్లు ఎగిసి 66,758 వద్ద కొనసాగుతున్నాయి. నెట్‌వెబ్ టెక్నాలజీ షేర్లు 88 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,707 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,834 వద్ద మొదలైంది. 66,723 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,984 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 51 పాయింట్ల లాభంతో 66,758 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 19,778 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,850 వద్ద ఓపెనైంది. 19,798 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,867 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 31 పాయింట్లు పెరిగి 19,810 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 46,285 వద్ద మొదలైంది. 46,175 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,310 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 195 పాయింట్లు పెరిగి 46,257 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ఉన్నాయి. సిప్లా, హిందాల్కో, దివిస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, టాటా కన్జూమర్, హిందుస్థాన్ యునీలివర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యురబల్స్ సూచీలు పడిపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.60,490 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1100 పెరిగి రూ.81500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.25,520 వద్ద కొనసాగుతోంది.
Also Read: వంటింటి మంట నుంచి ఉపశమనం, ఆయిల్ రేట్లు భారీగా తగ్గాయి!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.