Edible Oil Prices: సామాన్య జనానికి ఊరటనిస్తూ, వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. గత ఏడాది కాలంలో రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ రేట్లు గణనీయంగా తగ్గాయని ప్రకటించింది. రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ 29 శాతం, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ 19 శాతం, పామోలిన్ ఆయిల్ 25 శాతం తగ్గాయని లెక్కలతో వివరించింది. 


వంట నూనెల రేట్లు ఎందుకు దిగొచ్చాయి?
దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు, గ్లోబల్‌గా క్రూడ్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ రేట్లు పతనం కావడంతో ధరలు దిగొచ్చాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో, కేంద్ర ఆహారం, వినియోగదార్ల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, లిఖితపూర్వక సమాధానం రూపంలో లోక్‌సభకు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయంగా తగ్గుతున్న రేట్ల ప్రయోజనాలు మన దేశంలోని సామాన్య వినియోగదార్లకు చేరేలా, కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరలను నిశితంగా పరిశీలిస్తోందని కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు.


రిటైల్ రేట్లపై సేవింగ్‌ బెనిఫిట్స్‌ ప్రజలకు అందించడానికి సెంట్రల్‌ గవర్నమెంట్‌ నిరంతరం ప్రయత్నిస్తోందని, తన లిఖితపూర్వక సమాధానంలో సాధ్వి నిరంజన్ జ్యోతి పేర్కొన్నారు. ఇది మాత్రమే కాకుండా, అంతర్జాతీయ తగ్గిన రేట్లకు అనుగుణంగా దేశంలోనూ MRP (Maximum retail price) తగ్గించడానికి ఎడిబుల్‌ ఆయిల్‌ ఇండస్ట్రీ ప్రముఖులు, కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో, దేశంలో వంట నూనెల రేట్లను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం (Import duty) కూడా తగ్గించింది.


సామాన్య జనానికి ప్రయోజనం
ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం (Ukraine-Russia War) ప్రారంభ సమయంలో, అన్ని కమొడిటీస్‌తో పాటు వంట నూనెల ప్రైస్‌ కూడా పీక్‌ స్టేజ్‌కు వెళ్లింది. ఆ తర్వాత, అంతర్జాతీయంగా క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, క్రూడ్‌ సోయాబీన్‌ ఆయిల్‌, క్రూడ్‌ పామోలిన్‌ ఆయిల్‌ రేట్లు కూలాఫ్‌ అయ్యాయి. దీంతో, క్రూడ్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ను దేశంలోకి ఇంపోర్ట్‌ చేసుకుంటున్న కంపెనీల మీద ఖర్చుల భారం తగ్గింది. లోకల్‌ మార్కెట్‌లోనూ నూనె పంటల దిగుబడి పెరిగింది. తగ్గిన వంట నూనె ధరల ప్రయోజనాన్ని ప్రజలకు పంపిణీ చేయడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఎడిబుల్‌ ఆయిల్‌ రేట్లు తగ్గించేలా ఆయా కంపెనీలకు సూచించాలని ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌ను గతంలోనే కోరింది. లీటరు ధర రూ. 8 నుంచి రూ. 12 వరకు తగ్గించాలని సూచించింది. దీనిపై, ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌ నుంచి కేంద్ర ప్రభుత్వానికి హామీ లభించింది. ఈ నేపథ్యంలో, మదర్ డెయిరీ, అదానీ విల్మార్, జెమిని ఎడిబుల్‌ అండ్‌ ఫ్యాట్స్ ఇండియా సహా ప్రముఖ కంపెనీలన్నీ MRP తగ్గించాయి. దీంతో.. ధార (DHARA), ఫార్చూన్‌ (Fortune), జెమిని (Gemini) సహా చాలా బ్రాండ్ల రేట్లు దిగి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు దేశీయ మార్కెట్‌లోనూ నూనె పంటల లభ్యత పెరగడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 


మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Tata Consumer, Netweb, RVNL


Join Us on Telegram: https://t.me/abpdesamofficial