Stock Market Opening 21 February 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. మదుపర్లు కొన్ని రంగాల షేర్లను కొనుగోలు చేస్తున్నారు. పీఎస్‌యూ బ్యాంక్ సూచీ ఒక శాతానికి పైగా పతనమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 63 పాయింట్లు పెరిగి 17,907 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 209 పాయింట్ల ఎగిసి 60,900 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మెటల్స్, స్టీల్ షేర్లకు డిమాండ్ పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,691 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,770 వద్ద మొదలైంది. 60,655 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,938 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 209 పాయింట్ల లాభంతో 60,900 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 17,844 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,905 వద్ద ఓపెనైంది. 17,837 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,914 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 63 పాయింట్లు పెరిగి 17,907 వద్ద చలిస్తోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 40,784 వద్ద మొదలైంది. 40,508 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,849 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 135 పాయింట్లు పెరిగి 40,837 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టపోయాయి. ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. విప్రో, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ సూచీలు ఎగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 100 తగ్గి రూ.56,730గా ఉంది. కిలో వెండి రూ.68,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.24,610 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.