Stock Market Opening 18 April 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఐటీ కంపెనీ షేర్ల పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితితో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 34 పాయింట్లు తగ్గి 17,672 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 130 పాయింట్లు తగ్గి 59,780 వద్ద ట్రేడవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, ఐటీసీ పాజిటివ్‌గా కదలాడుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,910 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,991 వద్ద మొదలైంది. 59,717 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,113 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 130 పాయింట్ల నష్టంతో 59,780 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 17,706 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,766 వద్ద ఓపెనైంది. 17,650 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,766 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 34 పాయింట్లు తగ్గి 17,672 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,406 వద్ద మొదలైంది. 42,272 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,446 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 127 పాయింట్లు పెరిగి 42,446 వద్ద నడుస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐచర్ మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో షేర్లు నష్టపోయాయి. ఐటీ, మీడియా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు నష్టపోయాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.60,920గా ఉంది. కిలో వెండి రూ.1100 తగ్గి రూ.77,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.27,660 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.