Stock Market Closing 17 April 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. క్యూ4లో ఐటీ కంపెనీల గైడెన్స్ తగ్గడం, అంచనాలకు తగ్గట్టు ఫలితాలు లేకపోవడంతో మార్కెట్‌లో నెగెటివ్ సెంటిమెంట్ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 121 పాయింట్లు తగ్గి 17,706 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 520 పాయింట్లు తగ్గి 59,910 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలహీనపడి 81.97 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,431 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,385 వద్ద మొదలైంది. 59,442 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,407 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 520 పాయింట్ల నష్టంతో 59,910 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 17,828 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,863 వద్ద ఓపెనైంది. 17,574 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,863 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 121 పాయింట్లు తగ్గి 17,706 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,603 వద్ద మొదలైంది. 41,799 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,603 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రానికి 130 పాయింట్లు పెరిగి 42,262 వద్ద క్లోజైంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, ఎస్‌బీఐ, బ్రిటానియా, కోల్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఎల్‌టీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి. ఫైనాన్స్, ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కళకళలాడాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.61,030గా ఉంది. కిలో వెండి రూ.78,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.190 తగ్గి రూ.27,330 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.