By: ABP Desam | Updated at : 17 May 2023 10:55 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixabay )
Stock Market Opening 17 May 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. వరుస ర్యాలీకి నేడు తెరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 52 పాయింట్లు తగ్గి 18,233 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 177 పాయింట్లు తగ్గి 61,754 వద్ద కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,932 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,932 వద్ద మొదలైంది. 61,733 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,979 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 177 పాయింట్ల నష్టంతో 61,754 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 18,286 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,300 వద్ద ఓపెనైంది. 18,232 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,309 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 52 పాయింట్లు తగ్గి 18,233 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,948 వద్ద మొదలైంది. 43,786 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,992 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 101 పాయింట్లు తగ్గి 43,802 వద్ద నడుస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 27 నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యూపీఎల్, బీపీసీఎల్, సిప్లా లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, ఇన్ఫీ, టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మీడియా, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.490 తగ్గి రూ.61,420గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.30 పెరిగి రూ.28,170 వద్ద ఉంది.
Also Read: భారతీయ వంటకాల గురించి ఒక్క ముక్కలో చెప్పాడు - అంతే, కామెంట్ల వరద పారింది
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Deal only with SEBI registered stockbrokers and transfer funds only to their registered client bank accounts! To know more: https://t.co/jnYKAwNh9g#NSE #NSEIndia #InvestorAwareness #ClientBankAccounts @ashishchauhan pic.twitter.com/bRbYSukytg
— NSE India (@NSEIndia) May 17, 2023
In this segment of #LetsTalkFinance, let's understand what Short Selling is!#InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #StockMarketIndia #StockMarket #Investor #Investment #ShortSelling pic.twitter.com/JULi926old
— NSE India (@NSEIndia) May 16, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్