search
×

Stock Market News: రోజువారీ గరిష్ఠాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ - దూసుకెళ్తున్న ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు

Stock Market Opening 17 January 2023: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 17 January 2023: 

భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 107 పాయింట్ల లాభంతో 18,002 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 392 పాయింట్ల లాభంతో 60,485 వద్ద కొనసాగుతున్నాయి. కంపెనీలు మెరుగైన త్రైమాసిక ఫలితాలు వెల్లడిస్తుండటం, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీలు పెరగడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. 

BSE Sensex

క్రితం సెషన్లో 60,092 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,142 వద్ద మొదలైంది. 60,072 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,578 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 392 పాయింట్ల లాభంతో 60,485 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

సోమవారం 17,894 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,922 వద్ద ఓపెనైంది. 17,886 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,029 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 107 పాయింట్ల లాభంతో 18,002 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 42,241 వద్ద మొదలైంది. 42,029 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,383 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 100 పాయింట్లు పెరిగి 42,268 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ఉన్నాయి. ఎల్‌టీ, హిందుస్థాన్‌ యునీలివర్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బీపీసీఎల్‌ షేర్లు నష్టపోయాయి. మీడియా, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ సూచీలు ఎగిశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

Published at : 17 Jan 2023 11:06 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

టాప్ స్టోరీస్

Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి

Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి

Mazaka movie OTT: 'మజాకా' ఓటీటీ డీల్ క్లోజ్... థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్?

Mazaka movie OTT: 'మజాకా' ఓటీటీ డీల్ క్లోజ్... థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్?

Kodali Nani About Red Book: నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్

Kodali Nani About Red Book: నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్

BCCI Vs Team India: కుటుంబ సభ్యులను కలిసేందుకు టీమిండియా ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక మెలిక పెట్టిన బీసీసీఐ

BCCI Vs Team India: కుటుంబ సభ్యులను కలిసేందుకు టీమిండియా ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక మెలిక పెట్టిన బీసీసీఐ