Stock Market Opening Bell 11 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలే అందాయి. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు మదుపర్లను ఇబ్బంది పెట్టలేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 141 పాయింట్ల లాభంతో 17,676 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 569 పాయింట్ల లాభంతో 59,386 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 79.48 వద్ద ఉంది.


BSE Sensex


క్రితం సెషన్లో 58,817 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,320 వద్ద మొదలైంది. 59,320 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,484 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటల సమయంలో 569 పాయింట్ల లాభంతో 59,386 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 17,534 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,711 వద్ద ఓపెనైంది. 17,668 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,719 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 141 పాయింట్ల లాభంతో 17,676 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 38,712 వద్ద మొదలైంది. 38,646 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,885 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 554 పాయింట్ల లాభంతో 38,842 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా కన్జూమర్స్‌, అపోలో హాస్పిటల్స్‌, ఎస్‌బీఐ లైఫ్, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఒక శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ఉన్నాయి. 




Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.