Stock Market Opening 10 May 2023:  


స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 24 పాయింట్లు తగ్గి 18,240 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 84 పాయింట్లు తగ్గి 61,676 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 61,761 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,843 వద్ద మొదలైంది. 61,572 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,965 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 84 పాయింట్ల నష్టంతో 61,676 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 18,265 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,313 వద్ద ఓపెనైంది. 18,211 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,323 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 24 పాయింట్లు తగ్గి 18,241 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 43,275 వద్ద మొదలైంది. 42,822 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,375 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 215 పాయింట్లు తగ్గి 42,982 వద్ద నడుస్తోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, పవర్‌ గ్రిడ్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, యూపీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హీరోమోటో కార్ప్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.280 పెరిగి రూ.62,130గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.78,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.1090 పెరిగి రూ.29,260 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.